

గురుకులాల్లో ఆగని ఫుడ్ పాయిజన్ ఘటనలు
నిజామాబాద్ జిల్లాలోని గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్, 23 మంది విద్యార్థులకు అస్వస్థత
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కోటయ్య క్యాంపస్ లోని ఎస్సీ సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో 23 మంది విద్యార్దులు అస్వస్థతకు గురయ్యారు బుధవారం ఉదయం హాస్టల్లో పప్పు అన్నం తిన్న విద్యార్దులు, ఉదయం 11 గంటలకు వాంతులు చేసుకున్నారు, వెంటనే వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీలో గురుకులాల పిల్లలను అద్భుతంగా చూసుకుంటున్నాము అని చెప్పిన మాటలు అన్నీ ఉత్తి మాటలే అని, క్షేత్ర స్థాయిలో పరిస్థితి దారుణంగా ఉందని విద్యార్థుల తల్లితండ్రులు విమర్శిస్తున్నారు..