

గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గించిన HDFC
లోన్లు తీసుకునే వారికి HDFC బ్యాంక్ గుడ్‌న్యూస్ చెప్పింది. రుణ ఆధారిత వడ్డీ రేట్లను 10 బేసిన్ పాయింట్ల మేర తగ్గించింది. ఇవి 2025 ఏప్రిల్ 7 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఎంపిక చేసిన వివిధ టెన్యూర్లపై ఇది వర్తిస్తుంది. హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఆటో లోన్ లాంటి రుణాలపై ఈఎంఐ భారం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు ఎంసీఎల్‌ఆర్ లింక్ చేసి లోన్లు తీసుకున్న వారికి కూడా ఈ ప్రయోజనం చేకూరనుంది