

గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి మృతి పై సమగ్ర విచారణ జరిపించాలి
ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రాయిసిడం జంగు పటేల్
మనోరంజని ప్రతినిధి అదిలాబాద్ మార్చి 10 :- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న లలిత మరణానికి పాఠశాల సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రాయిసిడం జంగు పటేల్ అన్నారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు 50 లక్షల ఆర్థిక సహాయం చేయాలని, రాష్ట్రంలో ఇప్పటి వరకు గురుకుల, ఆశ్రమ, సంక్షేమ హాస్టళ్లలో 85 మంది పైన విద్యార్థుల మరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు