అమరావతి…
భోగాపురం ఎయిర్ పోర్ట్ కు గాజువాక నుంచి ట్రాఫిక్ రద్దీ తగ్గింపు,కొత్త రోడ్ల నిర్మాణంపై అసెంబ్లీలో సమాధానం ఇచ్చిన మంత్రి నారాయణ.
నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం.
………..నారాయణ.మంత్రి కామెంట్స్…..
విశాఖలో భోగాపురం ఎయిర్ పోర్ట్ కు వెళ్లేందుకు ట్రాఫిక్ రద్దీ తగ్గింపునకు మెట్రో తో పాటు కొత్త రోడ్ల ప్రతిపాదనలున్నాయి.
ట్రాఫిక్ నివారణకు విశాఖ మెట్రో ప్రతిపాదన ఉంది.
గాజువాక నుంచి భోగాపురం వరకూ మద్దిలపాలెం,మధురవాడ మీదుగా 34.6 కిలోమీటర్లు మెట్రో నిర్మాణం.
మెట్రో ప్రతిపాదనలు కేంద్రానికి పంపించాం…కేంద్రం నుంచి ఖచ్చితంగా ఆమోదం పొందేలా చూస్తాం.ఆమోదం రాగానే పనులు ప్రారంభిస్తాం.
విశాఖలో మెట్రో రైలు వస్తే ట్రాఫిక్ కొంతమేర తగ్గుతుంది.
కానీ మెట్రో ప్రాజెక్ట్ పూర్తికి నాలుగేళ్లు పడుతుంది.
ఏహెచ్ 45 రోడ్డుపై ట్రాఫిక్ తగ్గించడానికి 15 అంతర్గత రోడ్లు ఏడాదిన్నరలోగా పూర్తయ్యేలా అధికారులను ఆదేశించాను.
పాత హైవే ఏహెచ్ 47 నుంచి ఎన్ హెచ్ 16 కు ఆరు రోడ్లు ప్రతిపాదన ఉంది.
విశాఖలోని ఎమ్మెల్యేలు,అధికారులతో మీటింగ్ పెట్టాలని మంత్రిని కోరిన స్పీకర్.
వచ్చే వారమే మీటింగ్ పెడతానని సభలో చెప్పిన మంత్రి నారాయణ.