

గచ్చిబౌలి పోలీసుల అదుపులో ముగ్గురు మైనర్ విద్యార్థులు….
గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ తోటి క్లాస్ మేట్ ఓ అబ్బాయితో చనువుగా వుండటం సెల్ ఫోన్ లో వీడియో తీసి తమతో కూడా ఫ్రీగా ఉండాలంటూ వేధింపులకు గురిచేశారు. బాలిక విషయం తల్లిదండ్రులకు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఒకే స్కూల్ లో క్లాస్ మేట్స్ అని పోలీసులు తెలిపారు. పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వొద్దు ఇస్తే నిత్యం గమనించాలన్నారు