

గంటకు వందల కోట్ల వ్యాపారం.. పదుల సంఖ్యలో ఆత్మహత్యలు.. బెట్టింగ్ యాప్‌లను అపేదెలా..?
బెట్టింగ్ యాప్‌ల పేరుతో గంటకు వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది..!
రోజుకు పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి..!
పట్నమే కాదు ప్రతి పల్లెకూ విస్తరించిందీ బెట్టింగ్ మార్కెట్.
కోట్లాది మంది సంపాదనలో 50 శాతానికి పైగా బెట్టింగ్‌పైనే పెడుతున్నారు. మరలాంటి బెట్టింగ్ మాఫియాను మట్టుబెట్టేదెలా..?
యాప్‌లను అపెదెట్లా..?
నిర్వహకులపై ఫోకస్ సరే.. అసలు ట్రాక్ చేసెదెలా..?
బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై కేసులు పెట్టారు. చాలా మందిని విచారణకూ పిలిచారు. పలువురిని అరెస్ట్ కూడా చేశారు. పరారీలో ఉన్నవాళ్ల కోసం వేట సాగిస్తూనే ఉన్నారు. ఇదంతా సరే.. అసలు బెట్టింగ్ అన్నదే లేకుండా చేయడం సాధ్యమేనా..?
నిర్వాహకులను పట్టుకోవడం అయ్యే పనేనా..?
ఇప్పుడిదే పెద్ద సవాల్‌గా మారింది.
నిర్వహకులను పట్టుకోవడం… అలాగే ఊసరవెల్లిలా రంగులు మార్చే యాప్‌లను నియంత్రించేందుకు టెక్కీలను సైతం రంగంలోకి దించుతున్నారు. బెట్టింగ్ యాప్‌లపై ప్రజల్లోనూ అవగాహణ పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఐపీఎల్‌తో ఇప్పుడు పోలీసులకు బిగ్ టాస్క్ వచ్చి పడింది. బెట్టింగ్ రాయుళ్లు బెస్ట్ టైమ్‌గా భావించే ఈ ఐపీఎల్‌లో కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగే అవకాశాలున్నాయి. గెలుపోటములపైనే కాదు.. బంతిబంతికీ బెట్టింగులు నడుస్తుంటాయి. దీంతో నిఘా పెంచారు పోలీసులు. బెట్టింగు బాబుల బెండు తీయడమే కాదు.. నిర్వహకుల అంతుచూసేందుకు సిద్ధమయ్యారు. మరి చూడాలి ఈ బెట్టింగ్ మాఫియాను ఎలా కట్టడి చేస్తారో..