

క్రీడల పోటీల వలన క్రీడాకారుల నైపుణ్యాలు మెరుగవుతాయి : ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి
రేగడి చిలకమర్రిలో రేగడి చిలకమర్రి ప్రీమియర్ లీగ్ ప్రారంభించిన ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి
మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 10 :క్రీడల పోటీల వలన క్రీడాకారులలోని నైపుణ్యాలు మెరుగవుతాయని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి అన్నారు. కొందుర్గ్ మండలం లోని రేగడి చిల్కమర్రి గ్రామంలో రేగడి చిల్కమర్రి ప్రీమియర్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలు ప్రారంభమైనవి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి హాజరయ్యారు. క్రీడా పోటీలను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ క్రికెట్ క్రీడల్లో పాల్గొనడం వలన, క్రికెట్ క్రీడను ఆడడం వలన క్రీడాకారులు శారీరక దృఢత్వం పెరిగి, మానసిక సంతులన కలిగి క్రీడాకారులలో ఆలోచన విధానం పెరుగుతుందని అన్నారు. క్రీడల పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి లోపల క్రీడా స్ఫూర్తిని రగిలించారు.ఈ కార్యక్రమంలో తో కొందుర్గు మండలం మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జెడ్పిటిసి తనయుడు రామకృష్ణ, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, మాదేవ్ పూర్ రవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు, మాజీ సర్పంచ్ లు, బంధులాల్, టేకులపల్లి మోహన్ రెడ్డి, నరసింహారెడ్డి, ఖలీల్,ప్రేమ్ కుమార్, ఆంజనేయులు, ఉపసర్పంచ్లు కుమార్, యాదయ్య గౌడ్ మరియు, దర్గ రాంచెంద్రయ్య, హరిశ్వర్ రెడ్డి, శేఖర్, కిరణ్, వీరేందర్ రెడ్డి, వేణు, శ్రీకాంత్, సందీప్, పి. శేఖర్, సత్యం, పెర్మల్ రెడ్డి, రాములు, ఉమెంతల్ క్రిష్ణ, నర్సిములు, శ్రీకాంత్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
