

క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్లు – ఒక్కసారి అప్లై చేస్తే ఎన్నిసార్లైనా తీసుకోవచ్చని మీకు తెలుసా?
మీ-సేవ కేంద్రాల ద్వారా పొందిన ఆదాయ, కుల ధ్రువపత్రాలు ఒక్కోసారి రెండో దఫా కూడా అవసరం అవుతాయి. ఆ టైంలో తిరిగి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండానే 5 నిమిషాల్లోనే పొందవచ్చు. ఈ విషయం తెలియని చాలా మంది మళ్లీ మళ్లీ మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకుంటూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ విలువైన టైం వృథా చేసుకుంటున్నారు. అలాంటి సమస్యలను అధిగమించేందుకు పరిష్కార మార్గాలు చూపించారు మీ-సేవ ఉన్నత అధికారులు. ఒకసారి పొందిన పత్రాలను సంవత్సరం లోపు ఎన్ని సార్లైనా రుసుం చెల్లించి తీసుకొనే వెసులుబాటును కల్పించారు.
ఎలా తీసుకోవాలంటే? :
తొలిసారి తీసుకున్న ఆదాయ, కుల ధ్రువపత్రాలకు సంబంధించిన రసీదుపై అప్లికేషన్ నంబర్ ఉంటుంది. రెండో సారి అదే ధ్రువపత్రం అవసరం అయినప్పుడు మీ-సేవ కేంద్రానికి వెళ్లి అప్లికేషన్ లేదా ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే గతంలో పొందిన ధ్రువపత్రాల సమాచారం కంప్యూటర్లో కనిసిస్తాయి. అప్పుడు చిరునామా, సెల్ఫోన్ నంబర్ నమోదు చేసి రూ.35 చెల్లిస్తే సరిపోతుంది. చిటికెలో ఆదాయ, కుల ధ్రువపత్రం మన చేతికి వచ్చేస్తుంది. సమయం ఆదా అవుతుంది.