

కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్
మనోరంజనీ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 12 : వ్యవసాయ రసాయనాల సంస్థ ఎన్ఎసీఎల్ ఇండస్ట్రీస్లో మెజార్టీ వాటా అగ్రి సొల్యూషన్స్ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ చేతికి వెళ్లనుంది. ఎన్ఎసీఎల్లో 53.13% వాటాకు సమానమైన 10,68,96,146 ఈక్విటీ షేర్లను ఒక్కోటి రూ.76.70 చొప్పున మొత్తంగా రూ.820 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు కోరమాండల్ ఇంటర్నేషనల్ సమాచారం ఇచ్చింది. ఇందుకు తమ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని పేర్కొంది
