

కొత్తగా 100 పోలీస్ స్టేషన్లు
TG: శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. శాంతిభద్రతలు, ట్రాఫిక్, మహిళ, సైబర్ పోలీస్ స్టేషన్లతో కలిపి రాష్ట్రంలో ప్రస్తుతం 844 ఉండగా, కొత్తగా మరో 100కు పైగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కాబోతున్నాయని సమాచారం.