

కొట్టాల ప్రవీణ్ కుటుంబానికి మిత్రుల ఆర్థిక సాయం
మనోరంజని ప్రతినిధి ఆర్ముర్ మార్చి 23 :- గత కొన్ని రోజుల క్రితం అకాల మరణం చెందిన కొట్టాల ప్రవీణ్ కుటుంబాన్ని జిల్లా పరిషత్ రామ్ మందిర్ 2006-2007 మిత్రులు పరామర్శించారు. మిత్రులందరూ కలసి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. ప్రవీణ్ కుమార్తె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కిసాన్ వికాస్ పత్రం పథకం ద్వారా ₹50,000 రూపాయలను అందజేశారు. మిత్రుల ఈ సహాయ చర్య వల్ల కుటుంబ సభ్యులకు కొంత భరోసా కలిగించడమే కాకుండా, వారి ఆర్థిక స్థితిని మెరుగుపరిచే దిశగా ముందడుగు వేశారు.మిత్రుల మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ, ఈ చర్య ఆదర్శంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు
