

కొంప ముంచిన దురాశ…
డబ్బులు ఆశ చూపడంతో అఘోరీ కి ఆశ్రయ మిచ్చిన మంగళగిరికి చెందిన ఓ కుటుంబం.
యువతిని లోబరుచుకుని జంప్ అయిన అఘోరీ. లబోదిబోమంటున్న యువతి కుటుంబ సభ్యులు
*గత కొంతకాలంగా లేడీ అఘోరీ గా చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి…తన కూతుర్ని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి పోయాడు అని గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణానికి చెందిన తురిమెల్ల కోటయ్య నిన్న మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కూతురు ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తుందని. నాలుగు నెలల క్రితం లేడీ అఘోరి మంగళగిరి నేషనల్ హైవే మీద ఒంటి మీద బట్టలు లేకుండా హల్చల్ చేస్తుంటే…పోలీస్ వారు ఎవరైనా మహిళలు ఉంటే కొంచెం లేడి అఘోరికి బట్టలు కప్పండి అని చెప్పిన తర్వాత తమ కూతురు ధైర్యంతో వెళ్లి బట్టలు కప్పిందని, అప్పటినుంచి నా కూతురు ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడటం జరుగుతుందని. కొంతకాలం గడిచిన తర్వాత మా ఇంటికి కూడా వచ్చి నా కూతుర్ని మాయ మాటలతో మోసం చేసి ఆకుపసరు తో లేపనాలు పూసి, వశీకరణ చేసుకొని అఘోరీల ఆశ్రమానికి యువరాణి ని చేస్తారని చెప్పి తన కూతుర్ని పూర్తిగా తనవైపు తిప్పుకున్నాడని వాపొయ్యాడు