కేసీఆర్‌ క్యాంపు కార్యాలయానికి టులెట్‌ బోర్డు..

కేసీఆర్‌ క్యాంపు కార్యాలయానికి టులెట్‌ బోర్డు..

మనోరంజని ప్రతినిధి గజ్వేల్‌, మార్చి 20: – మాజీ సీఎం కేసీఆర్‌కు తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు షాకిచ్చాయి. గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బీజేపీ నాయకులు బుధవారం టులెట్‌ బోర్డు పెట్టారు. గజ్వేల్‌ ఎమ్మెల్యే అయిన మాజీ సీఎం కేసీఆర్‌ నియోజకవర్గానికి రాకపోవడంపై వాంటెడ్‌ ఎమ్మెల్యే అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచి 15 నెలలైనా కేసీఆర్‌ ఒక్కసారి కూడా గజ్వేల్‌ వైపు చూడలేదని బీజేపీ శ్రేణులు ఈ సందర్భంగా అన్నారు. ప్రజలకు వద్దకు రాని కేసీఆర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మరోపక్క, గజ్వేల్‌ ఎమ్మెల్యే కేసీఆర్‌ కనబడటం లేదంటూ గజ్వేల్‌, గౌరారం పోలీసుస్టేషన్లలో యూత్‌ కాంగ్రెస్‌ నేతలు వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. కాగా, బీజేపీ నేతల నిరసనపై గజ్వేల్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి ఫైరయ్యారు. అల్లరిమూకలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తాళాలు పగలుగొట్టి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాయంటూ గజ్వేల్‌ పోలీస్‌ స్టేషన్‌లో బీజేపీ నాయకులపై ఫిర్యాదు చేశారు..

  • Related Posts

    భీమారంలో బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్.

    భీమారంలో బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్. *మనోరంజని మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 03 :- భీమారం మండల కేంద్రంలో బీజేవైఎం మంచిర్యాల జిల్లా కార్యవర్గ సభ్యుడు కొమ్ము కుమార్ యాదవ్,భీమారం మండల ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజేశం…

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భీమారంలో బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్.

    భీమారంలో బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్.

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు