

కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటున్నా: రేవంత్
తెలంగాణ : మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటున్నా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆయన సభలోకి రావాలని, సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నా అని తెలిపారు. 15 నెలల పాటు సభకు రాకున్నా కేసీఆర్ జీతభత్యాలు పొందుతున్నారని అన్నారు. కేసీఆర్ వర్క్‌ఫ్రం హోమా? వర్క్ ఫ్రం ఫామ్‌హౌసా తెలియడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. ఈ 15 నెలల్లో కేసీఆర్ తీసుకున్న జీతంభత్యం రూ.57.87 లక్షలు అని సీఎం రేవంత్ పేర్కొన్నార