కేజీబీవీని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యేలు
మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 10 :- నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవి (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం) లో ఆకస్మిక తనిఖీ చేసిన బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావ్ పటేల్ అనంతరం ఎమ్మెల్యేలు పాఠశాలలోని సౌకర్యాలను, ఇబ్బందులను విద్యార్ధినులను అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఎదగాలని సూచిస్తూ ఏటువంటి ఇబ్బందులు ఉన్నా తమ ధృషికి తీసుకురావాలని కోరారు. అనంతరం పాఠశాల ఆవరణను మొత్తం సందర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు సత్యనారాయణ గౌడ్, మండల అధ్యక్షులు నరేందర్, నాయకులు సవీన్, దత్తురాం, సుధాకర్, శ్రీకాంత్ రెడ్డి, రాజేందర్, రాజు, గంగారాం తో పాటు తదితరులు పాల్గొన్నారు