నిన్న ఢిల్లీలో పోలీసులు కింద పడిపోయిన ఒక విద్యార్థి మీద లాఠీల వర్షం కురిపిస్తుండగా హిందుస్తాన్ టైమ్స్ విలేఖరి అనుశ్రీ ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించబోయింది. అది చూసిన పోలీసు అధికారి, “ఆమె కెమెరా పగులగొట్టండి” అని అరిచాడు. పోలీసు జవాన్లు ఆమె మీద పడి కెమెరా లాక్కున్నారు.
అదే సమయంలో అక్కడే ఉన్న మరొక మహిళా జర్నలిస్టు ఛాతీ మీద చెయ్యి వేసి ఒక పోలీసు అధికారి ఆమెను వెనక్కి తోశాడు. ఆ తర్వాత ఆ మహిళా జర్నలిస్టును విద్యార్థి అనుకుని తోశామని వివరణ ఇచ్చారు. అయితే పోలీసులకు విద్యార్థినుల ఛాతీ మీద చెయ్యి వేసే అధికారం ఉందన్నమాట! అది లైంగిక వేధింపు కాదన్నమాట!
అప్పుడే ఫస్ట్ పోస్ట్ విలేఖరి ప్రవీణ్ సింగ్ చేతికి తీవ్రమైన గాయం అయింది. మరెందరో జర్నలిస్టులకు దెబ్బలు తగిలాయి.
నిన్న జరిగిన ఈ దాడికి నిరసనగా ఇవాళ ఢిల్లీలోని ఫొటో జర్నలిస్టులు పోలీసు ప్రధాన కార్యాలయం ముందు తమ కెమెరాల చేత ఇలా నిరసన ప్రదర్శన చేయించారు.
చిత్రాలు అక్షరాల కన్నా ఎక్కువ వ్యక్తం చేస్తాయి అంటారు. ఇది అటువంటి అపురూప చిత్రం!!!
మీడియా టుడే న్యూస్
రిపోర్టర్
వాసు
భద్రాచలం
కెమెరాలే నిరసన ప్రకటిస్తే…
నిన్న ఢిల్లీలో పోలీసులు కింద పడిపోయిన ఒక విద్యార్థి మీద లాఠీల వర్షం కురిపిస్తుండగా హిందుస్తాన్ టైమ్స్ విలేఖరి అనుశ్రీ ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించబోయింది. అది చూసిన పోలీసు అధికారి, “ఆమె కెమెరా పగులగొట్టండి” అని అరిచాడు. పోలీసు జవాన్లు ఆమె మీద పడి కెమెరా లాక్కున్నారు.
అదే సమయంలో అక్కడే ఉన్న మరొక మహిళా జర్నలిస్టు ఛాతీ మీద చెయ్యి వేసి ఒక పోలీసు అధికారి ఆమెను వెనక్కి తోశాడు. ఆ తర్వాత ఆ మహిళా జర్నలిస్టును విద్యార్థి అనుకుని తోశామని వివరణ ఇచ్చారు. అయితే పోలీసులకు విద్యార్థినుల ఛాతీ మీద చెయ్యి వేసే అధికారం ఉందన్నమాట! అది లైంగిక వేధింపు కాదన్నమాట!
అప్పుడే ఫస్ట్ పోస్ట్ విలేఖరి ప్రవీణ్ సింగ్ చేతికి తీవ్రమైన గాయం అయింది. మరెందరో జర్నలిస్టులకు దెబ్బలు తగిలాయి.
నిన్న జరిగిన ఈ దాడికి నిరసనగా ఇవాళ ఢిల్లీలోని ఫొటో జర్నలిస్టులు పోలీసు ప్రధాన కార్యాలయం ముందు తమ కెమెరాల చేత ఇలా నిరసన ప్రదర్శన చేయించారు.
చిత్రాలు అక్షరాల కన్నా ఎక్కువ వ్యక్తం చేస్తాయి అంటారు. ఇది అటువంటి అప