

కుభీర్ తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి 50లక్షల రూపాయల నిధుల మంజూరు
*ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్*
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 22 :- ఎన్నో సంవత్సరాలుగా తహసిల్దార్ కార్యాలయం లేక ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి శుభవార్త ను అందించారు. ఎమ్మెల్యే పవర్ రామరావు పటేల్. భవన నిర్మాణానికి 50 లక్షల రూపాయల ఎస్. డి. ఎఫ్.నిధులు మంజూరైనట్లు ఆయన చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా కార్యాలయం లేక అక్కడి ఆసుపత్రి గది, ప్రస్తుతం బీసీ హాస్టల్ భవనంలో తహసీల్దార్ కార్యాలయం ఉంది. దీంతో సంవత్సరాల తరబడి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కార్యాలయం నిర్మిస్తే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. భవన నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో కుబీర్ మండల ప్రజలు, బిజెపి నాయకులు, అధికారులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు చెప్పారు. మారుమూల మండలమైన కుభీర్ లో భవన నిర్మాణానికి నిధులు మంజూరు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.