కుబీర్ లో అంబరాన్ని అంటిన హోలీ సంబరాలు…..
కుబీర్ మండల కేంద్రంతో పాటు కుబీర్ మండలంలోని వివిధ గ్రామాలలో నటిన హోలీ సంబరాలు. పిల్లలు సంతోషంగా రంగుల మైకంలో మునిగిపోయారు. వాడ వాడనా గల్లి గల్లిన పిల్లలందరూ రంగులు చల్లుకొని ఆనందంతో ఆటలు ఆడినారు. ఈ హోలీ పండుగ అనేది శరీరానికి ఆరోగ్యమును తేలికపాటి చేస్తుంది. మానసిక బాధలను పారదోలుతుంది. హోలీ సందర్భంగా ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో పిల్లలందరూ ముఖాలకు రంగులు పూసుకోవడంతో వారి వారి తల్లిదండ్రులకు గుర్తుపట్టది రీతిలో హోలీ పండుగను జరుపుకున్నారు. అనంతరం కుబీర్ మండల నాయకులు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రవీందర్, మాజీ ఎంపీపీ తూము లక్ష్మీబాయి రాజేశ్వర్, రైతు అధ్యక్షుడు సురేష్, గంగయ్య, సాయినాథ్, బాబు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.