కుటుంబ సభ్యుల సహకారంతో ఏదైనా సాధించవచ్చు

కుటుంబ సభ్యుల సహకారంతో ఏదైనా సాధించవచ్చు
….నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన జోత్స్నకు ఘన సన్మానం

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 16 – కుటుంబ సభ్యుల సహకారంతోపాటు పట్టుదలతో శ్రమిస్తే ఏదైనా సాధించవచ్చు అని నిర్మల్ జిల్లా శాస్త్రి నగర్ లో నివాసముంటున్న గాంధారి జోష్న అన్నారు ఇటీవల వెలుపడ్డ పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి పాలిటెక్నిక్ కళాశాల లో జూనియర్ లెక్చరర్ గా నాలుగవ ఉద్యోగం సాధించిన జోష్ణ దంపతులను నిర్మల్ జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నూనె శ్రీనివాస్ సాగర్ అమ్ముల ఘనంగా శాలువా పూలమాలతో సన్మానించారు మొదటగా నిర్మల్ జిల్లా వ్యవసాయ అధికారి కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగం సంపాదించారు తర్వాత హైదరాబాదులోని టీ కే ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు తర్వాత గ్రూప్ ఫోర్ పరీక్ష రాసి అందులో ఆదిలాబాద్ రెండవ బెటాలియన్లు జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం నిర్వహించి ప్రస్తుతం నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ఇటీవల గ్రూపు వన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు తల్లిదండ్రులు ఛాయాదేవి రాజన్నలు ప్రైవేట్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు తన భర్త ప్రభాకర్ ప్రసూతి ఆస్పత్రిలో నర్సింగ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. వీరి ప్రోత్సాహంతోటి నేను ఈ ఉద్యోగాలు సంపాదించానని ఆమె పేర్కొన్నారు ఆమెను పలువురు అభినందించారు

  • Related Posts

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు శివశంకర భవాని ప్రసాద్ కు పురోహిత వైభవ ప్రవీణ బిరుదు ప్రధానం మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్…

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి.. ఏప్రిల్ ఎండలు మండు అని చదివే ఉంటారు. కానీ, మార్చి నెల మొదలైన నాటినుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. బయట తిరగాలంటే బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం పూట ఎండలు భగభగ మంటున్నాయి.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..

    నాతో ఎంజాయ్ చేయ్, జాబ్ పర్మినెంట్ చేస్తా’..

    నాతో ఎంజాయ్ చేయ్, జాబ్ పర్మినెంట్ చేస్తా’..

    కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది .

    కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది .