

కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక
మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు పటేల్ అధ్యక్షుడిగా, జక్కుల గజేందర్ ఉపాధ్యక్షుడిగా, మాగం నాగరాజ్ ప్రధాన కార్యదర్శిగా, సీపటిపతి వివేకానంద కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ, మున్నూరు కాపు సమాజ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సంఘం సభ్యుల మద్దతుతో సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో ప్రగతికి కృషి చేయాలని సంకల్పించారు