

కాళ్లకు సంకెళ్లు వేసి.. వ్యక్తితో వెట్టి చాకిరీ…
కాళ్లకు సంకెళ్లు వేసి ఓ వ్యక్తితో పోలీస్ స్టేషన్‌లో వెట్టి చాకిరీ చేయిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కేసు విషయంలో పీఎస్ లో ఉన్న వ్యక్తి కాళ్లకు పెద్ద చైన్‌తో సంకెళ్లు వేసి చీపురుతో పొలీస్టేషన్ క్లిన్ చేయించుకుంటున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు…..