కాగజ్నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
మనోరంజని ప్రతినిధి కాగజ్ నగర్ మార్చి 08 _ కాగజ్నగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఇన్స్పెక్టర్ P. రాజేంద్ర ప్రసాద్ గారు మహిళా పోలీస్ సిబ్బంది శ్రీలత, లావణ్య, లక్ష్మి, జ్యోత్శ్న మరియు స్వప్న లను సన్మానించి, వారి అంకితభావానికి, ధైర్యసాహసాలకు ప్రశంసలు కురిపించారు.ఈ సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడంతో పాటు, మహిళా సిబ్బందికి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. మహిళా పోలీసులు పోలీస్ శాఖలో కీలక భూమిక పోషిస్తూ, సమాజంలో శాంతి, భద్రత కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు, అలాగే ఇంటి బాధ్యతలను, ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సమాజానికి గొప్ప ఉదాహరణగా నిలుస్తున్నారు అని ఇన్స్పెక్టర్ అన్నారు. వారి అంకితభావాన్ని గుర్తించి, ప్రత్యేకంగా ఈ రోజు సాయంత్రం మహిళా పోలీస్ సిబ్బందికి సెలవు మంజూరు చేశారు. కాగజ్నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎల్లప్పుడూ మహిళా సాధికారత, భద్రత కోసం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.