కాగజ్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

కాగజ్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

మనోరంజని ప్రతినిధి కాగజ్ నగర్ మార్చి 08 _ కాగజ్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మహిళా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్ P. రాజేంద్ర ప్రసాద్ గారు మహిళా పోలీస్ సిబ్బంది శ్రీలత, లావణ్య, లక్ష్మి, జ్యోత్శ్న మరియు స్వప్న లను సన్మానించి, వారి అంకితభావానికి, ధైర్యసాహసాలకు ప్రశంసలు కురిపించారు.ఈ సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడంతో పాటు, మహిళా సిబ్బందికి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. మహిళా పోలీసులు పోలీస్ శాఖలో కీలక భూమిక పోషిస్తూ, సమాజంలో శాంతి, భద్రత కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు, అలాగే ఇంటి బాధ్యతలను, ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సమాజానికి గొప్ప ఉదాహరణగా నిలుస్తున్నారు అని ఇన్‌స్పెక్టర్ అన్నారు. వారి అంకితభావాన్ని గుర్తించి, ప్రత్యేకంగా ఈ రోజు సాయంత్రం మహిళా పోలీస్ సిబ్బందికి సెలవు మంజూరు చేశారు. కాగజ్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎల్లప్పుడూ మహిళా సాధికారత, భద్రత కోసం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష