

కాంగ్రెస్ ప్రభుత్వం లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 24 :- కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్యే పవర్ రామరావ్ పటేల్ అన్నారు. నిన్న హైదరాబాదులో ట్రైన్ లో నుండి ఓ మహిళ అగంతకుల బారి నుండి కాపాడుకునేందుకు ట్రైన్ లో నుంచి దూకి తీవ్ర గాయాల పాలయింది. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆమెను పరామర్శించడానికి ప్రభుత్వ ఆసుపత్రి కి వెళ్లగా సరైన చికిత్స అందక పోవడం తో యశోద ఆసుపత్రికి తరలించి, బిజెపి ఎమ్మెల్యేలకు సమాచారం అందించడంతో వారు lపరామర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గాయాల పాలైన మహిళకు ఆసుపత్రి లో చికిత్స ఖర్చును పూర్తి స్థాయి లో బిజెపి పార్టీ భరిస్తుందన్నారు. ఎవరైతే అగంతకులు దాడికి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కు తెలియ జేయడం జరిగిందన్నారు.ఈ విషయాన్ని అసెంబ్లీలో సైతం ప్రస్తావిస్తామన్నారు. మహిళలను ఆదుకోవడానికి బిజెపి పార్టీ ఎప్పుడు ముందుంటుందన్నారు. మహిళను రక్షించి ఆసుపత్రికి తీసుకువచ్చిన శిల్పారెడ్డిని, మహిళా మోర్చా నాయకురాళ్లను ఆయన అభినందించారు. ఎమ్మెల్యే పటేల్ తో పాటు బిజెపి శాసనసభ పక్ష ఉప నేత పాయల శంకర్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు బాధిత మహిళను పరామర్శించిన వారిలో ఉన్నారు

