కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి

ఒర్వలేకనే అడ్డుకోవడం సరికాదు

కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి

ఒర్వలేకనే అడ్డుకోవడం సరికాదు

ప్రోటోకాల్స్ పేరుతో రాజకీయం చేస్తున్న

నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిట సునీత లక్ష్మారెడ్డి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమన్న గారికి నరేందర్ రెడ్డి

మనోరంజని ప్రతినిధి వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి మనోరంజని మార్చి 22 – మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులనే కాకుండా సేవాగల్ స్వచ్చంద సంస్థల సహకారం తో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని. అభివృద్ధి కి సహకరించాల్సిన ఆమె కొంతమంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు స్వార్థ పరుల మాయ మాటలు వినుకుంటూ రాజకీయ స్వార్థంతో పనులను అడ్డుకోవడం దారుణం. అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమన్న గారి నరేందర్ రెడ్డి తెలియజేశారు ఆయన మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం సెహగల్ స్వచ్చంద సంస్థ నర్సాపూర్ నియోజవర్గంలో కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటే ప్రోటోకాల్ పేరిట నియోజకవర్గం లోని అధికారులపై బెదిరింపులకు దిగడం శోచనీయమని ముఖ్యంగా అన్నదాతలను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గం లో ఉన్నటువంటి వాగు లపై చెక్ డ్యామ్, చెరువులు కుంటల్లో పూడికతీత పనులు, కట్ట వెడల్పు, కార్యక్రమాలు రైతుల కోసం చేయడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల రక్షణ కోసం పాఠశాలలో ప్రహరీలు సెహగల్ స్వచ్చంద సంస్థ చేపడుతుంటే వాటిని అడ్డుకోవడానికి ఎమ్మెల్యే ప్రయత్నించడం ఎంతవరకు సమాజ సమని చేతనైతే రాజకీయంగా ఎదురుకోవాలి కానీ అభివృద్ధి పనులను అడ్డు కోవద్దని వారు డిమాండ్ చేశారు ఇప్పటికైనా ఎమ్మెల్యే తన వైఖరి మార్చుకొని స్వచ్చాందంగా అభివృద్ధి రైతుల కోసం విద్యార్థుల కోసం చేస్తున్నటువంటి పనులకు సహకరించాలని స్వార్థపర రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు స్వచ్ఛంద సంస్థలతో కుమ్ముకొని ఏదో డబ్బులు సంపాదించు కోవాలని ఉద్దేశంతో పనిచేయడం లేదని స్వచ్ఛందంగా అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులం ముందు ఉండి అభివృద్ధి కోసమే పని చేయడం జరుగుతుందని ప్రోటోకాల్ పేరుతో అభివృద్ధి పనులను అడ్డుకోవడం మానుకోవాలని వారు తెలియజేశారు పది సంవత్సరాలలో బిఆర్ఎస్ పార్టీ. ఎంత అభివృద్ధి చేసిందో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసిందని 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులే స్వార్థపర రాజకీయం చేశారని వారు ఆరోపించారు తెలంగాణ రాష్ట్రంలో మూడవసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో రెండవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు 17 నెలల నుంచి తమ ఓటమిని జీవించుకోలేక నే కాంగ్రెస్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడం తప్ప గత మీ ప్రభుత్వంలో ప్రోటోకాల్ ను అవలంబించార అని పత్రికముకంగా ప్రశ్నిస్తున్నామని వారు తెలియజేశారు ఇకనైనా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పై చేస్తున్నటువంటి ఆరోపణను మానుకోవాలని లేనిపక్షంలో ప్రజలే తగిన గుణపాఠం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పడం తద్యమని వారు ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను దశలవారుగా నెరవేర్చే ప్రయత్నంలోనే ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీ ఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆరోపణను నమ్ముకుని దీనమైన స్థితిలో లేరని ఆయన తెలియజేశారు

  • Related Posts

    సిసి రోడ్ల నిర్మాణానికి ఒక కోటి 92 లక్షలు మంజూరు

    సిసి రోడ్ల నిర్మాణానికి ఒక కోటి 92 లక్షలు మంజూరు మనోరంజని ప్రతినిది ముధోల్ మార్చి 23 – నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని వివిధ గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సిసి రోడ్లు- సైడ్ డ్రెన్ల…

    కాంస్య పథకం సాధించిన స్వాతికి సన్మానం

    కాంస్య పథకం సాధించిన స్వాతికి సన్మానం మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 23 నిర్మల్ జిల్లా ముధోల్ మండలం ఆష్ట గ్రామానికి చెందిన ముద్దుబిడ్డ, శేఖర్-సుగుణ దంపతుల కుమార్తె స్వాతి గత ఫిబ్రవరి నెలలో రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భవతి మహిళ

    పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భవతి మహిళ

    ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

    ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

    సిసి రోడ్ల నిర్మాణానికి ఒక కోటి 92 లక్షలు మంజూరు

    సిసి రోడ్ల నిర్మాణానికి ఒక కోటి 92 లక్షలు మంజూరు

    కాంస్య పథకం సాధించిన స్వాతికి సన్మానం

    కాంస్య పథకం సాధించిన స్వాతికి సన్మానం