కాంగ్రెస్ పార్టీ పొత్తు ధర్మాన్ని పాటించడం హర్షణయం..
సిపిఐకి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు
సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం శ్రీను, ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎం పవన్ చౌహన్
అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ ఆ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీలో పంపించడం జరిగింది. ఇప్పుడు పొత్తు ధర్మాన్ని పాటించి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులకు మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు సిపిఐ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ. ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్.. అద్దంకి దయాకర్. (ఎస్సి) శంకర్ నాయక్ (ఎస్టీ), విజయ శాంతి (బీసీ) ఒక స్థానాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకి కేటాయించిన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలిపారు.