

కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షునికి బంజారా యువసేన ఆధ్వర్యంలో ఘన సన్మానం.
నిర్మల్ జిల్లా కేంద్రంలో టి ఎన్ జి ఓ భవనంలో బంజారా యువసేన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడు కాంబ్లే సూర్యకాంత్ నీ బంజారా యువసేన ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. బంజారా యువసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రశాంత్ జాదవ్ లంబాడి హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రోహిదాస్ నాయక్ మాట్లాడుతూ అదిలాబాద్ జిల్లా మారుమూల ప్రాంతాల నుండి ప్రజలకు సామాజిక సేవలు అందిస్తూ వస్తున్న క్రమంలో రాజకీయంగా సేవలు అందిస్తూ ముందుకు సాగాలని కోరుతూ మర్యాదపూర్వకంగా సన్మానించడం జరిగింది అని అన్నారు. ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంటోల్ల వెంకటస్వామి అంబేద్కర్ సంఘ నాయకుడు ఎర్రోళ్ల పురుషోత్తం నేటి వార్త పాత్రికేయులు ముదిరాజ్ రాజు పాల్గొనడం జరిగింది