

కల్తీ మరియు కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ ఉత్పత్తులపై టాస్క్‌ఫోర్స్ కొరడ
వరంగల్ కరీమబాదులోని సాయిబాబా కూల్ డ్రింక్స్ డిస్ట్రిబ్యూటర్ లో కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ లభ్యం.
దాదాపు 21 రకాల సుమారు 77,935 వేల విలువ గల కాలం చెల్లిన కూల్ డ్రింకులు స్వాధీనం.
వరంగల్ మహా నగరంలో ఫుడ్ సేఫ్టీ విషయంలో నాణ్యత,పరిశుభ్రత ప్రమాణాలు పాటించకుండా ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్న వ్యాపారస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలనే గట్టి నిర్ణయంతో వరంగల్ పోలీసు కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ జా గారి ఆదేశాల మేరకు,టాస్క్‌ఫోర్స్ ఎ.సి.పి మధుసూదన్ గారి ఆద్వర్యం లో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎం. రంజిత్ కుమార్ తన సిబ్బంది తో కొత్తిమీర కారు శైలజ భర్త రాజు నడుపుతున్న సాయిబాబా కూల్ డ్రింక్స్ డిస్ట్రిబ్యూషన్ షాపు లో వరంగల్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎం. రంజిత్ కుమార్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు సంయుక్తంగా దాడి చేసి అమ్మకానికి సిద్ధంగా ఉన్న కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ సుమారుగా 77,935వేలు విలువ గల 21 రకాల ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని షాప్ ఓనర్ కొత్తిమీర కారు శైలజ W/o రాజు,35 years,ఆరే కటిక, r/0 కరీంబాద్, వరంగల్ని విచారణ నిమిత్తం Millscolony SHO గార్కి అప్పగించడం జరిగింది.
వ్యాపారస్తులకు పోలీస్ వారి హెచ్చరిక
ఆహార భద్రత విషయంలో అపరిశుభ్రంగా,కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయించినా, నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై చర్యలు తప్పవు, ప్రముఖ బ్రాండ్‌లను మార్పు చేసి విక్రయాలు చేస్తున్న నకిలీ వస్తువులపై నిఘా ఉంచాం. గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయిస్తే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006, 2011 రూల్స్, రెగ్యులేషన్స్ ప్రకారం నిబంధనలు పాటించని ఫుడ్ సేఫ్టీ శాఖ సహాయంతో వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం. ఇట్టి దాడిలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎం రంజిత్ కుమార్, ఎస్ ఐ వడ్డే దిలీప్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కృష్ణమూర్తి , మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు