కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :-

నిర్మల్ జిల్లా ముధోల్ మండలం కరేగాం గ్రామంలో బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత పశు ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో పశువులకు నట్టల నివారణ, వ్యాధి నిరోధక టీకాలు, గర్భకోశ వ్యాధులకు పరీక్షలు నిర్వహించి, ఉచిత మందుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బైంసా వ్యవసాయ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామనాథ్ నాయక్, ఎన్ ఎస్ యు ఐ ముధోల్ మండల అధ్యక్షులు శశి కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ మాట్లాడుతూ పాడి రైతులకు సబ్సిడీ ద్వారా పశువులు సరఫరా చేయాలని, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క ద్వారా ఈ అంశంపై కృషి జరుగుతుందని” అలాగే, రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. ఎండాకాలంలో పాడి రైతులకు పశుదాన సరఫరా చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పశువులు ఆరోగ్యంగా ఉంటేనే పాడి రైతులు ఆదాయం పొందుతారని అన్నారు. పశువైద్యాధికారి డాక్టర్ రవీందర్ శిబిరంలో పశువులను వైద్యం చేస్తూ మందులు ఉచితంగా అందజేశారు. పశు వైద్య శిబిరానికి పాడి రైతుల నుంచి ప్రత్యేక స్పందన లభించినట్లు డాక్టర్ రవీందర్- శేఖర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు చంద్ర మోహన్ రెడ్డి , గంగారెడ్డి , నర్సారెడ్డి (డిసిఎంఎస్), సుధాకర్, రైతులు, తదితరులు పాల్గోన్నారు

  • Related Posts

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్ ఆకట్టుకున్న సైన్స్ ఎగ్జిబిషన్, ఫోటో గ్యాలరీ, సాంస్క్రతిక కార్యక్రమాలు ప్రభుత్వ హాస్టళ్ళలో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలోయువ ఉత్సవ్…

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి నిర్మల్ జిల్లా భైంసా మండలం వనాల్పడ్ గ్రామం లో స్థానిక ప్రభుత్వ వానాల్పడ్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆనందిత ఫౌండేషన్ చైర్మన్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బీటెక్ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

    బీటెక్ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి