

మనోరంజని ప్రతినిధి కరీంనగర్ మార్చి 09 – కరీంనగర్ జిల్లా గంగాధర మండలం పరిధిలోని ప్రజలకు ప్రయాణ సౌలభ్యం కల్పించేందుకు కరీంనగర్-వేములవాడ బస్సు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ రూట్లో కరీంనగర్, కురిక్యాల, ఉప్పరమల్యాల, రంగారావుపల్లె, తాడిజెర్రీ, గర్శకుర్తి, విలాసాగర్, మర్లపేట, బోయినపల్లి, వేములవాడ గ్రామాలు ఉన్నాయి.ఈ బస్సు పునఃప్రారంభోత్సవంలో చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ప్రయాణీకుల సౌలభ్యం కోసం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల్లో హర్షం వ్యక్తమైంది. కురిక్యాల గ్రామ స్టేజీ వద్ద ఎమ్మెల్యే మండల నాయకులతో కలిసి బస్సులో ప్రయాణిస్తూ, గర్శకుర్తి వరకు వెళ్లి ప్రయాణ అనుభవాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా రవాణా సేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
