

కరాటే కళ్యాణికి హేమ లీగల్ నోటీసులు..
తన పరువుకు భంగం కలిగించేలా కామెంట్స్ చేశారంటూ కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు పంపారు. అవాస్తవాలు ప్రచారం చేయడంతోపాటు అసభ్యంగా మాట్లాడారని తెలిపారు. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారంటూ హేమపై కేసు నమోదవడంతో MAA ఆమెను సస్పెండ్ చేసింది. తర్వాత టెస్టుల్లో నెగటివ్ రిపోర్టు రావడంతో సస్పెన్షన్ను ఎత్తేసింది. ఇదే విషయంపై కళ్యాణి, హేమకు గతంలో చాలాసార్లు వాగ్వాదాలు జరిగిన విషయం తెలిసిందే