కరపత్రాలు ఆవిష్కరించినవిశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నేతలు

ఏప్రిల్ 12న వీర హనుమాన్ విజయ యాత్ర

కరపత్రాలు ఆవిష్కరించిన
విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నేతలు

మనోరంజని ప్రతినిధి కరీంనగర్,మార్చి,29 :- ఏప్రిల్ 12వ తేదీన నగరంలో
వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఆదిమూలం విద్యాసాగర్ , భజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ కన్నం శంకర్ తెలిపారు. ఈ యాత్రకు సంబంధించిన కరపత్రాలు,వాల్ పోస్టర్లను శనివారం బిఎంఎస్ అనుబంధ
వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ యాత్ర గాంధీ రోడ్డులోని రామాలయం వద్ద ప్రారంభమై టవర్ సర్కిల్, ప్రకాశం గంజ్, కమాన్ చౌరస్తా, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, బస్టాండ్, గీత భవన్, కోర్టు రోడ్డు, మంచిర్యాల చౌరస్తా మీదుగా కొనసాగుతుందని తెలిపారు. ఈ యాత్ర ద్వారా హిందూ సమాజన్ని జాగృతం చేయడానికి విశ్వహిందూ పరిషత్ ప్రాంత ఉపాధ్యక్షులు డాక్టర్ రామ్ సింగ్హా జరవుతారని చెప్పారు. ధైర్యం, శక్తి సామర్థ్యాలకు ప్రతీక అయినటువంటి హనుమంతున్ని ఆదర్శంగా తీసుకొని హిందూ యువత దేశ, ధర్మ రక్షణ కోసం పాటుపడాలనీ,లవ్ జీహాదీల నుండి మాతృ మూర్తుల రక్షణ,
మత మార్పిడుల నిరోధం కోసం ఈ ర్యాలీలో పాల్గొని విజవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాంత గోరక్ష కమిటీ సభ్యుడు ఊటుకూరి రాధాకృష్ణారెడ్డి, జిల్లా సహా కార్యదర్శి తోట రాజేందర్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ జిల్లా కో కన్వీనర్ గుజ్జేటి రాజేందర్, నగర కన్వీనర్ ఎల్లబోయిన మహేష్, నగర గోరక్ష ప్రముఖ్ వంశీ, నగర విద్యార్థి ప్రముఖ్ సంతోష్, నగర సహా సంయోజక్ రంజిత్, అలిమిల్ల సతీష్, నగర సత్సంగ్ ప్రముఖ్ వంగర ఆంజనేయులు,భజరంగ్ దళ్ నగర కన్వీనర్ మహేష్ యాదవ్,అఖిల్,అశోక్,సతీష్ తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు…

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క,ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌కు కృతజ్ఞతలు ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం