కన్నుల పండుగ హోలీ సంబరాలు

కన్నుల పండుగ హోలీ సంబరాలు

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 14 :- నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ తో పాటు వివిధ మండలాల్లో సోమవారం హోలీ పండుగ సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు, కాముని దహనం వేడుకల తర్వాతి రోజు హోలీ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. హోలీ పండుగను పురస్కరించుకొని వాడవాడల్లా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు రంగులు చల్లుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హోలీ పండుగ సందర్భంగా యువకులు ప్రత్యేకంగా విందులను ఏర్పాటు చేసుకొని సంబరాలు జరుపుకున్నారు. వివిధ రకాల వంటకాలను తయారుచేసి ఆరిగించారు. వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ఎమ్మెల్యేకు రంగులు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ హోలీ పండుగ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగును నింపాలని ఆకాంక్షించారు.ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించారు. నియోజకవర్గ ప్రజలకు హోలీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ సంబరాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని రంగులు చల్లుకున్నారు, గ్రామాల్లో ఎక్కడ చూసినా హోలీ పండుగ సంబరాల సందడి కనిపించింది.హెూలీ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు

  • Related Posts

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు శివశంకర భవాని ప్రసాద్ కు పురోహిత వైభవ ప్రవీణ బిరుదు ప్రధానం మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్…

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి.. ఏప్రిల్ ఎండలు మండు అని చదివే ఉంటారు. కానీ, మార్చి నెల మొదలైన నాటినుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. బయట తిరగాలంటే బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం పూట ఎండలు భగభగ మంటున్నాయి.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..

    నాతో ఎంజాయ్ చేయ్, జాబ్ పర్మినెంట్ చేస్తా’..

    నాతో ఎంజాయ్ చేయ్, జాబ్ పర్మినెంట్ చేస్తా’..

    కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది .

    కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది .