

కన్నులపండువగా వమిక నామకరణం మహోత్సవం
హాజరైన బంధు మిత్రులు, సన్నిహితులు
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 23 :- నిర్మల్ జిల్లా భైంసా మండలం లోని మాంజ్రీ గ్రామంలో ఆదివారం శ్రీకాంత్, రేణుక దంపతుల సంతానం లో మొదటి కూతురు వమిక నామకరణం మహోత్సవం కన్నులపండువగా జరిగింది. నామకరణం మహోత్సవానికి బంధువులు, మిత్రులు హాజరై వమిక ను ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో కుటుంబ సభ్యులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, సన్నిహితులు, గ్రామస్తులు, ప్రముఖులు పాల్గొన్నారు
