

కనీస మద్దతు ధరల చట్టం చేయాలి అని నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 07 :- కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలపై సంయుక్త కిసాన్ మోర్చా పోరాటం కొనసాగిస్తుందని సంయుక్త కిసాన్ మోర్చా, అఖిలభారత ఐక్య రైతు సంఘం (AIUKS) రాష్ట్ర సహాయ కార్యదర్శి నందిరామయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నూతన్ కుమార్ అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి జే రాజులు అన్నారు శుక్రవారం జాతీయ పిలుపులో భాగంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి ఏవో ను వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతాంగం యొక్క నడ్డి విరుస్తూ వ్యవసాయ రంగ మొత్తాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే కుట్రలు పన్నుతున్నదని విమర్శించారు రైతాంగం 13 నెలల పాటు ఢిల్లీ రహదారులపై ధర్నాలు చేసి సాధించిన మూడు చట్టాల రద్దును దొంగ దారిలో జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ ముసాయిదా పేరుతో తీసుకొని రావడం చూస్తుంటే మోడీ ప్రభుత్వం ఎవరికోసం పనిచేస్తున్నదో తెలుస్తున్నదని విమర్శించారు రైతాంగం పండించిన పంటలకు మద్దతు ధరలు దొరకక అప్పుల పాలై అనేకమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే మద్దతు ధరల చట్టం చేయమని అడుగుతూ ఉంటే వీటి గురించి పట్టించుకోని మోడీ కార్పొరేట్ల కోసం మాత్రం వేగంగా వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొస్తున్నాడని అన్నారు కనీస మద్దతు ధరల చట్టం చేసే వరకు రైతాంగం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పోరాటాన్ని కొనసాగిస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం రైతాంగం యొక్క సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని బడ్జెట్ తగ్గించడం సరికాదని అన్నారు ఈ ధర్నాకు టియుసిఐ రాష్ట్ర కార్యదర్శి కే రాజన్న మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి,aiks జిల్లా కార్యదర్శి నాగెల్లి నర్సయ్య,గంగారం,aipks నాయకులు గోరే భాయ్,సుందర్,దేవ్రావు,మోహన్,రాజేష్, AIKMS నాయకులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
