కట్టుకున్న భార్యపై అతి కిరాతకంగా హత్యాయత్నం చేసిన యువకుడు

తిరుపతి జిల్లా…పెళ్లకూరు మండలం

కట్టుకున్న భార్యపై అతి కిరాతకంగా హత్యాయత్నం చేసిన యువకుడు

👉ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్న సంవత్సరానికి వరకట్న వేధింపులు ఇప్పుడు హత్యాయత్నం

పెళ్లకూరు మండలం టెంకాయతోపు గుర్రపుతోటలో దారుణం..భార్య లక్ష్మిప్రియను అతి కిరాతకంగా స్క్రూడ్రైవర్‌తో పొడిచిన భర్త హేమంత్‌,లక్ష్మిప్రియ కేకలు విని కాపాడిని స్థానిక యువకులు
అక్కడికి చేరుకోవడంతో పరారైన భర్త హేమంత్‌..

శ్రీ కాళహస్తి కి చెందిన హేమంత్ కుమార్ అనే యువకుడు కడప జిల్లా రైల్వే కోడూరు చెందిన లక్ష్మీ ప్రియ అనే మహిళను ప్రేమించి పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నాడు. హేమంత్ కుమార్‌ పెళ్లైన కొద్ది రోజుల నుండే లక్ష్మీ ప్రియాను కట్నం డబ్బులు కోసం వేధించడం మొదలుపెట్టాడు. పలుమార్లు లక్ష్మీప్రియపై దాడి చేసి కట్నం డబ్బులు తెస్తావా తేవా లేకుంటే నేను ఇంట్లో నుంచి తరిమేస్తానని కొట్టడంతో తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి అక్కడే ఉంటుంది.వివాహమైన సంవత్సరానికి మగ బిడ్డకు జన్మనిచ్చిన లక్ష్మీప్రియను భర్త హేమంత్ కుమార్ అనుమానం పడడం మొదలుపెట్టాడు. గత నాలుగు నెలల క్రిందట భార్య వద్దకు వెళ్లి నిన్ను బాగా చూసుకుంటాను నాతో వచ్చేయి మనం వేరు కాపురం ఉందామని చెప్పి కాళహస్తిలోని ఓ గృహం అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం భార్యభర్తల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో భార్యపై దాడి పాల్పడ్డాడు. దాడిలో గాయపడిన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్తానని నమ్మబలికించి పెళ్లకూరు మండలం టెంకాయతోపు వద్దకు తీసుకు వచ్చి ఆ మహిళపై అత్యంత కిరాతకంగా స్క్రూడ్రైవర్‌తో పొడిచి కత్తితో దాడి చేశాడు. దాడి చేస్తున్న సమయంలో అటుగా వెళుతున్న నలుగురు యువకులు గమనించి ఆ మహిళను కాపాడారు. ఈ క్రమంలో నిందితుడు హేమంత్‌ అక్కడి నుంచి పరారైయ్యాడు. ప్రేమించి నమ్మబలికి ప్రేమ వివాహం చేసుకున్న ఆ మహిళపై అత్యంత కిరాతకంగా దాడి చేయడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో ఆ మహిళ చికిత్స పొందుతుంది. ఇప్పటికైనా బాధిత మహిళలకు తగు న్యాయం చేయవలసిందిగా బాధితులు కోరుతున్నారు.

  • Related Posts

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు! మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 13 – మా ఇంటాయన తాగు బోతు అయిపోయాడు.. సంసారం నాశనమైపోతుం దని అడవాళ్లు ఆవేదన వ్యక్తం చేయడం సహజం. కానీ, ఇక్కడ మాత్రం మా ఆడాళ్లు తాగుబోతులైపోయారని,…

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం మనోరంజని ప్రతినిధి మార్చి 13 :- ఆంధ్రప్రదేశ్ : జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ రేపు (శుక్రవారం) ప్రారంభం అవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సా. 3.30 గంటల నుంచి సభ మొదలుకానుందని, 1600…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..