

ఓ మహిళ నీకు వందనం
మనోరంజని ప్రతినిధి పెద్దపల్లి జిల్లా:మార్చి 08 -సృష్టికి మూలం మహిళ ఆమె శక్తియుక్తులు అపారం. ఆమె ఓ ప్రేరణ.. ఓ లాలన. ఆమె లేకుంటే ఈ సృష్టి లేదు. దానికి గమ్యం, గమనం లేదు. మనిషికి జీవం, జీవితమే లేదు. ఆమే లేకుంటే అంతా శూన్యం. అందుకే ఆమెకు శతకోటి వందనాలు. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చరిత్ర సృష్టిస్తున్నారు. అవకాశాలు రాకపోయినా, అవమానాలు ఎదురైనా.. ఎవరో వచ్చి సాయం చేస్తారని ఎదురుచూడడం లేదు. ఆకాశం, అవకాశాల్లో సగంగా అంటూ ముందం జలో దూసుకుపోతున్న స్త్రీమూర్తులెందరో. వంట గదికే ‘ఆమె’ను అంకితం చేద్దామని చూస్తే అంతరిక్షంలో దూసుకెళ్లింది.వాకిలి దాటొద్దని ఆంక్షలు పెడితే ఆవలి హద్దులు దాటి అవనిని జయించింది. అణచివేత నుంచి ఆత్మవిశ్వాసం వైపు పయనించింది. వంటింటి నుంచి విశ్వానికి ఎదిగింది. ఆమె ప్రస్థానం అంతా ఇంతా కాదు.. ఏ రంగమైనా నేనే మేటి అని నిరూపిం చిన తెగువ, తెలివి ఆమెది.