ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయాలి

ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయాలి

ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

మనోరంజని ప్రతినిధి తానుర్ మార్చి 07 :- పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయాలని ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ అన్నారు. తానూర్ మండలం బొరిగాం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ తరుపున ట్రస్ట్ ఛైర్మెన్ మోహన్ రావ్ పటేల్ బొరిగాం గ్రామస్థుల సమక్షంలో ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోహన్ రావ్ పటేల్ మాట్లాడుతూ నిరుపేద విద్యార్థుల చదువుకు అండగా నిలవాలనే ఉద్దేశంతో మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని జయిస్తూ విజయం సాధించాలని, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. చదివేమెళకువలు, అనుసరించాల్సిన విధానంపై వివరించారు. కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలని, ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. విద్యార్థులు పై చదువులు చదవడానికి ఏదైనా ఇబ్బంది ఎదురైతే మా ప్రజా ట్రస్ట్ సంప్రదించాలని తెలిపారు. విద్యార్థులు పాఠశాల అధ్యాపకులు మోహన్ రావ్ పటేల్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల అధ్యాపకులు, ట్రస్ట్ టీం సభ్యులు, బొరిగాం గ్రామస్థులు, తానుర్ మండల నాయకులు వివిధ గ్రామాల కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    శ్రీశైలం హైవేపై మరోమారు ట్రాఫిక్ సర్వే!

    శ్రీశైలం హైవేపై మరోమారు ట్రాఫిక్ సర్వే! మనోరంజని ప్రతినిధి శ్రీశైలం మార్చి 16 -ఏపీలో శ్రీశైలం హైవేలో ట్రాఫిక్ తీరుతెన్నులపై రాష్ట్ర ప్రభుత్వం మరోమారు సర్వే నిర్వహించనుంది. ఇప్పటికే ఓ సారి సర్వే పూర్తవ్వగా.. రూ.7,668కోట్ల అంచనా వ్యయంతో ఎలివేటెడ్ కారిడార్…

    గచ్చిబౌలి పోలీసుల అదుపులో ముగ్గురు మైనర్ విద్యార్థులు….

    గచ్చిబౌలి పోలీసుల అదుపులో ముగ్గురు మైనర్ విద్యార్థులు…. గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ తోటి క్లాస్ మేట్ ఓ అబ్బాయితో చనువుగా వుండటం సెల్ ఫోన్ లో వీడియో తీసి తమతో కూడా ఫ్రీగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    శ్రీశైలం హైవేపై మరోమారు ట్రాఫిక్ సర్వే!

    శ్రీశైలం హైవేపై మరోమారు ట్రాఫిక్ సర్వే!

    మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ హతం?

    మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ హతం?

    గచ్చిబౌలి పోలీసుల అదుపులో ముగ్గురు మైనర్ విద్యార్థులు….

    గచ్చిబౌలి పోలీసుల అదుపులో ముగ్గురు మైనర్ విద్యార్థులు….

    “భైంసా పట్టణంలో ఆడిటోరియం – సమగ్ర అభివృద్ధికి అవసరం “

    “భైంసా పట్టణంలో ఆడిటోరియం – సమగ్ర అభివృద్ధికి అవసరం “