ఒకే దేశం ఓకే ఎన్నికతో దేశాభివృద్ధి

ఒకే దేశం ఓకే ఎన్నికతో దేశాభివృద్ధి

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 24 :- ఒకే దేశం ఓకే ఎన్నిక ఎన్నికతో ప్రజలపై ఆర్థిక భారం పడకుండా దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రోగ్రాం అధికార ప్రతినిధి పైడిపల్లి గంగధర్, ఓకే దేశం ఓకే ఎన్నిక ప్రోగ్రాం జిల్లా కోకన్వీనర్ చిన్నారెడ్డి అన్నారు. సోమవారం బైంసా పట్టణంలోని ఎస్ ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో బిజెపి మండల నాయకులతో కలిసి వర్క్ షాప్ ను నిర్వహించిన సందర్భంగా వారు మాట్లాడారు. దేశవ్యాప్తంగా పళ్ళు దఫాలుగా ఎన్నికలు రావడంతో ఎలక్షన్ కోడ్ పేరుతో ప్రజాసేవకు ఆటంకం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి గ్రామంలో నలుగురు గుమి గూడిన చోట రచ్చబండలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సుస్థిరపాలన అందించాలంటే ఓకే దేశం ఓకే ఎన్నికతోనే సాధ్యమన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం మండల కన్వీనర్ గా ఎన్నికైన సాయినాథ్, పట్టణ కన్వీనర్ గా ఎన్నికైన దిలీప్ ను శాలవాతో సత్కరించారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు తాలోడ్ శ్రీనివాస్,బైంసా పట్టణ బిజెపి అధ్యక్షులు మల్లేష్, మండల అధ్యక్షురాలు సిరం సుష్మ రెడ్డి, మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, మాజీ కౌన్సిలర్ గౌతం పింగ్లే,నాయకులు భూమేష్, బండారి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఏప్రిల్ 3 న సీఎం రేవంత్ రెడ్డి,మంత్రివర్గ విస్తరణ?

    ఏప్రిల్ 3 న సీఎం రేవంత్ రెడ్డి,మంత్రివర్గ విస్తరణ? రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో విజయశాంతి చోటు? మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 29 – తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు…

    బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు.

    నిర్మల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గా ఇటీవల ఎన్నికయిన అల్లూరి మల్లారెడ్డి, స్పోర్ట్స్ & కల్చరల్ సెక్రటరీ వంశీ క్రిష్ణ ఎన్నికైన సందర్బంగా శనివారం సారంగాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు భూమా రెడ్డి,వెంకటరమణారెడ్డి, సత్యం లు వారి నివాసంలో కలసి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏప్రిల్ 3 న సీఎం రేవంత్ రెడ్డి,మంత్రివర్గ విస్తరణ?

    ఏప్రిల్ 3 న సీఎం రేవంత్ రెడ్డి,మంత్రివర్గ విస్తరణ?

    బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు.

    బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు.

    తెలంగాణకు మళ్లీ వర్ష సూచన..

    తెలంగాణకు మళ్లీ వర్ష సూచన..

    ధర్పల్లిలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జయంతి ఉత్సవాలు

    ధర్పల్లిలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జయంతి ఉత్సవాలు