ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్
హైదరాబాద్, మార్చి 13: అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. స్టేచర్ అంశంపై ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదంటూ హస్తం నేతలు హెచ్చరికలు జారీ చేశారు. సీఎం రాష్ట్రానికి పెద్దన్న లాంటి వారని కాంగ్రెస్ నేతలు తెలుపగా.. రేవంత్ రెడ్డిని పిచ్చికుక్కలతో పోల్చారు బీఆర్ఎస్ శ్రేణులు. ఇంతకీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎవరెవరు ఏం మాట్లాడాలో ఇప్పుడు చూద్దాం..