భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను గెలుచుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించిన భారత జట్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, "టీమిండియా అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ క్రికెట్లో మరోసారి భారత సత్తాను చాటింది. భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ల శ్రమ, పట్టుదల, అంకితభావం ప్రశంసనీయమైనవి" అని పేర్కొన్నారు. జట్టులోని ప్రతి ఆటగాడు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారని ఆయన కొనియాడారు. భారత క్రికెట్ జట్టు విజయాన్ని దేశ వ్యాప్తంగా అభిమానులు సంబరంగా జరుపుకుంటున్నారు.