

ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ!
TG: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఇవాళ మ.12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్ వెళ్లి గవర్నర్ జిష్ణుదేవ్ను కలవనున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణపై ఆయనతో చర్చించే అవకాశం ఉంది. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. క్యాబినెట్లో నలుగురికి చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది