ఏప్రిల్‌ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌

ఏప్రిల్‌ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌

మనోరంజని ప్రతినిధి అమరావతి :మార్చి 29 – వచ్చే పది రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు.టిడిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శనివారం మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ఆయన ప్రసంగించారు. ఏప్రిల్‌ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని, జూన్‌లో పాఠశాలలు తెరిచేలోపు నియామకం చేపట్టనున్నట్లు ఆయన వివరించారు..గతంలోనేడీఎస్సీ నోటిఫికే షన్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఈ మేరకు కేబినెట్​లోనూ తీర్మానం చేసింది.మెగా డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనుంది. ఆయా జిల్లాల్లోని స్థానికుల తోనే 80 శాతం ఉపాధ్యా య ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పాఠశాల విద్యా శాఖ పరిధిలో 13,661 పోస్టులు, ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2,024 ఖాళీలు ఉన్నాయి. అలాగే విభిన్న ప్రతిభా వంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49, బాల నేరస్తులకు విద్యా బోధన కోసం 15 టీచర్ పోస్టులు ఉండనున్నాయి.మరోవైపు సంక్షేమ పథకాల అమలు విషయంలో అంతిమ లబ్ధిదారు వరకూ ఫలాలు చేరాల్సిందేనని, మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు

  • Related Posts

    బైకుపై మృతదేహంతో నిరసన.

    బైకుపై మృతదేహంతో నిరసన. మనోరంజని స్టేట్ ఇంచార్జ్ ఆంధ్ర ప్రదేశ్: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఎర్రంపేటకు చెందిన దార్ల హేమ దుర్గా ప్రసన్నను (31) గంగన్నగూడెం గ్రామానికి చెందిన మోదుగ సాయి బలవంతంగా లోపర్చుకొని ఆమెతో ఏకాంతంగా ఉన్న వీడియోలను…

    హీటెక్కిన ఆంధ్రప్రదేశ్‌.. 150కి పైగా మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

    హీటెక్కిన ఆంధ్రప్రదేశ్‌.. 150కి పైగా మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు మచిలీపట్నంలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత… విజయవాడ: వడగాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఠారెత్తాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సగటున 40 డిగ్రీలకు చేరాయి. సాధారణం కంటే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం