

ఏప్రిల్ మూడో తేదీ నాడు ఇసుక వేలంపాట
ఇసుక అవసరం ఉన్నవారు ముందస్తుగా రెండు వేల రూపాయల రుసుము చెల్లించాలి
తాసిల్దార్ కృష్ణ
మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి మార్చ్ 27:_ మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని అక్రమంగా రవాణా చేసిన 13 ట్రాక్టర్ల ఇసుక ట్రిప్పులను గత నెల ఆరవ తేదీన సీజ్ చేయడం జరిగిందని ఇసుక రవాణా చేసి ప్రక్క ప్రక్కనే ఆరు ట్రాక్టర్ ట్రిప్పు లు 7 ట్రాక్టర్ల ట్రిప్పులు ప్రస్తాపక్కనే ఇసుక డంపుగా చేసినటువంటి ఇసుకను అలాగే అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నటువంటి ట్రాక్టర్లు తీసుకువచ్చి ఇసుకను తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో ఇసుకను కూడా వేలంపాట వేయడం జరుగుతుందని ఇట్టి అక్రమంగా ఇసుక చేసినటువంటి ఇసుకను ఏప్రిల్ మూడవ తేదీ నాడు ఉదయం 11 గంటలకు వేలంపాట వేయడం జరుగుతుందని వెల్దుర్తి తాసిల్దార్ కృష్ణ తెలియజేశారు ఆయన తాసిల్దార్ కార్యాలయంలో గురువారం నాడు విలేకరులతో ఆయన మాట్లాడుతూ వెల్దుర్తి మండల కేంద్రానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇసుక అవసరం ఉంటే ఏప్రిల్ మూడవ తేదీ లోపు 2000 రూపాయలు తాసిల్దార్ కార్యాలయంలో రుసుమును చెల్లించాలని రుసుము చెల్లించిన వారే ఇసుక వేలంపాటలో పాల్గొనాలని ఇసుక డంపింగ్ ఉప్పల కిషన్ పొలం వద్ద చేయడంతో అక్కడే వేలంపాట వేయడం జరుగుతుందని తాసిల్దార్ కృష్ణ తెలియజేశారు