ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు

ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు

మనోరంజని ప్రతినిధి అమరావతి :మార్చి 07 ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఏపీ హైకోర్టులో బెయిల్ మంజూ రైంది. కూటమి నేతలపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసును నమోదు అయిన సంగతి తెలిసిందే అయితే విజయవాడ, సూర్యాపేట, పీఎస్ లో నమోదైన కేసులో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూ రు చేసింది.. పోసానిపై విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా తనపై నమోదైన కేసులకు సంబం ధించి క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోసాని. తాను ఏదీ తప్పుగా మాట్లాడలేదని, సమాజంలో జరుగుతున్న విషయాలను ప్రస్తావించా నని, తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని పోసాని కృష్ణమురళి కోర్టుని అభ్యర్థించారు. పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా మరో 14 కేసులు ఉన్నాయి. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలంటూ ఇటీవల హైకోర్టులో పిటిషన్ వేశారు పోసాని. తనపై ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు తనకు వర్తించవని, తదుపరి చర్యలను నిలువరించాలని కోరారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను దూషించారం టూ పోసానిపై రాష్ట్రంలోని నాలుగు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వాటిని క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు. తనపై రాజకీయ ద్వేషంతోనే తప్పుడు కేసులు పెడుతు న్నారని పిటిషన్ లో పేర్కొన్న పోసాని.. ఆయా కేసుల్లో 41ఏ నోటీసులు వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.

  • Related Posts

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం మనోరంజని ప్రతినిధి మార్చి 13 :- ఆంధ్రప్రదేశ్ : జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ రేపు (శుక్రవారం) ప్రారంభం అవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సా. 3.30 గంటల నుంచి సభ మొదలుకానుందని, 1600…

    ఫామ్‌హౌస్ కేసు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీకి రెండోసారి నోటీసులు..

    ఫామ్‌హౌస్ కేసు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీకి రెండోసారి నోటీసులు.. హైదరాబాద్: ఫామ్‌హౌస్‌లో కోడిపందాల కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినబాద్ పోలీసులు రెండోసారి నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మాదాపూర్‌లో ఉంటున్న ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

    జగన్‌, కేసీఆర్‌లకు చివరి చాన్స్ !

    జగన్‌, కేసీఆర్‌లకు చివరి చాన్స్ !

    ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్

    ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్

    ఫామ్‌హౌస్ కేసు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీకి రెండోసారి నోటీసులు..

    ఫామ్‌హౌస్ కేసు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీకి రెండోసారి నోటీసులు..