

ఏపీ డీజీపీ ఆఫీసులో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. విజేతలకు డీజీపీ భార్య చేతుల మీదుగా బహుమతుల ప్రదానం
మనోరంజని ప్రతినిధి మార్చి 08
మహిళా సాధికారతతోనే సమాజ అభ్యున్నతి సాధ్యమన్న వక్తలు
విజేతలకు బహుమతులు అందజేసిన డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఆర్ధాంగి సీమా గుప్తా
ఏపీ డీజీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆర్ధాంగి సీమా గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను వక్తలు వివరించారు.
మహిళలు అన్నిరంగాల్లో దూసుకుపోతున్నారని, మహిళా సాధికారతతోనే సమాజం అభ్యున్నతి సాధించి, ప్రగతిపథంలో పయనిస్తుందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు సీమా గుప్తా చేతులు మీదుగా బహుమతి ప్రదానం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ ఐజిపి రాజకుమారి, డిఐజి కమ్యూనికేషన్స్ ఎన్ ఎస్ జే లక్ష్మి, డిసీపీ సరిత, డీజీపీ కార్యాలయంలోని ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగినులు పాల్గొన్నారు