

ఏపీలో ఈ రోజు నుంచి ఎన్టీఆర్ వైద్య సేవా ఎంప్లాయిస్ డ్యూటీలు బంద్
మనోరంజని ప్రతినిధి అమరావతి మర్చి 10 :ఏపీలో తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీ వైద్యసేవ ఎంప్లాయీస్ ఈ రోజు నుంచి విధులు బహిష్కరించనున్నారు. దీర్ఘకాలంగా తమ డిమాండ్లు పరిష్కారం కావడం లేదని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్ పరిధిలో పనిచేసే ఫీల్డ్ సిబ్బంది, వైద్యమిత్ర, టీం లీడర్స్, జిల్లా మేనేజర్, ఆఫీస్ అసోసియేట్స్, సీసీ కెమెరా మానిటర్ సిబ్బంది ఈ నెల 10, 17, 24 తేదీల్లో విధులు బహిష్కరించనున్నారు. దీంతో ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలిగే ఛాన్సుంది.