

ఏజెన్సీ ప్రాంతాల్లో బెల్ట్ షాపు సిండికేట్ లపై కఠిన చర్యలు చేపట్టాలి…
ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ కి ఫిర్యాదు చేసిన మణుగూరు సామాజిక సేవకులు కర్నే బాబురావు
ఏజెన్సీ ప్రాంతాలలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బెల్ట్ షాపులు సిండికేట్లపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ మణుగూరు ప్రాంత సామాజిక సేవకులు కర్నే బాబురావు సోమవారం భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ కి ఫిర్యాదు చేసినట్లు మణుగూరు ప్రాంత సామాజిక సేవకులు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాది కొత్తగూడెం జిల్లా పరిధిలోని మణుగూరు మండల శేషగిరి నగర్ గ్రామ నివాసిని పినపాక ఏజెన్సీ ఏరియాలో బెల్ట్ షాపులకు సిండికేటుకు ఎటువంటి అనుమతులు లేవని ఎక్సైజ్ సూపర్డెంట్ నేను పెట్టిన ఆర్టిఏ లెటర్ కి రిప్లై ఇచ్చారు. కానీ ఏజెన్సీలో మద్యం ఏర్లై పారుతుంది గతంలో తమరి దృష్టికి కూడా ఈ విషయాన్ని పలుమార్లు తీసుకొచ్చాను25-08-2024, 28-082024,08-10-2024, 24-8-2024 తేదీన ప్రజావాణి కార్యక్రమంలో తమరికి నేరుగా వినతి పత్రం అందజేశాను. అదేవిధంగా సింగరేణి కోల్ మైన్స్ జిఎం కి మణుగూరు సబ్ డివిజన్ అధికారికి, ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ కి కూడా వినతి పత్రం అందజేశాను కానీ బెల్ట్ షాపుల మీద సిండికేట్ మీద ఈరోజు మట్టికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు, అదికాక బడి లేదు, గుడి లేదు, ఆసుపత్రికి సింగరేణి కోల్ మైనింగ్ పరిధిలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టి పచ్చని కుటుంబంలో చిచ్చులు లేపుతున్నాయి బెల్ట్ షాపులు సిండికేట్ వ్యవస్థ మీద తగు చర్యలు తీసుకోవాలని అలాగే సంబంధిత అధికారులకు తెలియజేసిన కాపీలను కూడాబి. రాహుల్ కి అందజేసినట్లు కర్నే బాబురావు తెలిపారు