

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్రత కల్పించడం సంతోషంగా ఉంది.
- ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపిన యూత్ లీడర్ యాటెల్లి శ్రవణ్ కుమార్
మనోరంజని ప్రతినిధి గంగాధర మార్చి 18 :- ఎస్సీ వర్గీకరణ బిల్లును తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించి చట్ట భద్రత కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని యూత్ లీడర్ శ్రవణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా యాటెల్లి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా కొనసాగుతున్న వర్గీకరణ ఉద్యమం నేడు కార్యరూపం దాల్చిందని, త్వరలోనే వర్గీకరణ ప్రక్రియ పూర్తయి మాదిగ మరియు మాదిగ ఉపకులాల అందరికీ సముచిత స్థానాన్ని సముచిత న్యాయాన్ని అందించే విధంగా వర్గీకరణకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాదిగ మరియు మాదిగ ఉపకులాలు గుండెల్లో పెట్టుకొని చిరస్థాయిగా ప్రేమిస్తారని, వర్గీకరణతో ఎవ్వరికి ఎలాంటి సమస్యలు ఉండవని రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందించే విధానమే వర్గీకరణని తెలిపారు.
వర్గీకరణతోనే మాదిగలకు అన్ని రంగాలలో రాణించే అవకాశం ఉంటుందని, మాదిగ సోదరులందరూ రాజకీయ చైతన్యవంతులుగా సిద్ధం అవ్వాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా అసెంబ్లీలో బిల్లుకు ఆమోదానికి సహకరించిన దళిత ఎమ్మెల్యే లకు మరియు ఇతర మంత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు.