ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఎమ్మార్పీఎస్ డప్పు ప్రదర్శనలు

మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 04 ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణపై మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మార్చి 4 నుండి 10 వరకు గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో ఎమ్మార్పీఎస్ డప్పు ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సిరికొండ మండల కేంద్రంలో అధ్యక్షుడు మొట్టల దీపక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్, జిల్లా ఇంచార్జ్ ఇంజం వెంకటస్వామి హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణలో అన్యాయం జరిగిందని, జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికలో 11 శాతం రిజర్వేషన్ రావాల్సిందిగా సూచించబడినా, కేవలం 9 శాతానికి పరిమితం చేసారని మండిపడ్డారు. ఈ లోపాలను సవరించి అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గందమాల నాగభూషణం మాదిగ, జాతీయ మహిళా నాయకురాలు యమున, జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పర సంజీవ్, ధర్పల్లి మండల ఇంచార్జ్ నక్క రాజేందర్, డప్పు నర్సయ్య, సంగేమ్ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై పునరాలోచించాలి

    తెలంగాణ అసెంబ్లీలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును మారుస్తూ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బండారు రాజా శనివారం ఒక ప్రకటనలో స్పందించారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ…

    సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

    సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి గారి ఆదేశానుసారం. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అనైతికం. అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు సభాపతిని అడ్డం పెట్టుకొని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై పునరాలోచించాలి

    పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై పునరాలోచించాలి

    పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం

    పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం

    28వ సారి రక్తదానం చేసి ప్రాణాన్ని కాపాడిన పురుషోత్తం

    28వ సారి రక్తదానం చేసి ప్రాణాన్ని కాపాడిన పురుషోత్తం

    డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం?

    డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం?